Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో వెంట్రుక వచ్చిందనీ.. భార్యకు గుండుకొట్టించిన భర్త.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (13:51 IST)
తినే ఆహారంలో వెంట్రుక వచ్చిందన్న ఆగ్రహంతో కుటుంబ సభ్యుల ముందే తన భార్యను ఓ ప్రబుద్ధుడు గుండు కొట్టించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిలిబిత్ జిల్లా మిలాక్ అనే గ్రామానికి చెందిన జహీరుద్దీన్ - సీమాదేవి (30) అనే దంపతులు ఉన్నారు. ఏడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. శుక్రవారం రాత్రి సీమాదేవి తన భర్తకు ఆహారం వడ్డించింది. అందులో ఓ వెంట్రుక కనిపించడంతో జహీరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల ముందే భార్యను చితకబాదాడు. వారి ముందే గుండు కొట్టాడు. 
 
ఈ అవమానాన్ని భరించలేని సీమాదేవి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు గుండు కొట్టించాడని, పైగా, రూ.15 లక్షల కట్నం తీసుకుని రావాలంటూ అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఆమె పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జహీరుద్దీన్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments