హీరో సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. కన్నడలో సక్సస్‌ఫుల్ దర్శకుడు మరియు నటుడు నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చినబాబు, ఎం, సుబ్బారెడ్ది లు సమర్సించగా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, చిత్రాన్ని డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్ చేసి ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ.. ఇది నా డెబ్యూ ఫిలిం, నాకు ఈ అవకాశం కల్పించినందుకు థాంక్యూ. ఎక్కడికి వెళ్లిన ఈ టైటిల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. క్రెడిట్ గోస్ టూ హీరో సత్యదేవ్ గారు. డిశంబర్ 9న ఈ సినిమాకి రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఈ సినిమా ఫోర్ ఫేజ్ స్ అఫ్ లైఫ్. అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అయ్యే ఒక సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ నాలుగు ఫేజ్ స్ అయిపోయినవాళ్లు ఉంటారు, ప్రెజెంట్ ఆ ఫెజ్ రన్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని సెక్షన్స్ కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఎవరు చేయలేరేమో నాకు తెలిసి. ఈ సినిమాను భూపాల అన్న రాసేసి డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్ తో తెరకెక్కించాడు నాగశేఖర్ అన్న. ఈ జనరేషన్ కి ఒక గీతాంజలి లేదు "గుర్తుందా శీతాకాలం" ఈ జనరేషన్ గీతాంజలి అన్నట్లు ఈ సినిమాను చేసాడు. ఈ సినిమాలో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మి భూపాల అన్న నా సినిమా అంటే పెన్ , పేపర్ తో పాటు ప్రేమను కూడా కలుపుతారు. కాల భైరవ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. ఈ శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం గుర్తుండిపోతుంది అంటూ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.