Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మల్టీస్టారర్

Satyadev, Dolly
, బుధవారం, 30 నవంబరు 2022 (13:11 IST)
Satyadev, Dolly
సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్  ప్రధాన పాత్రలలో ఫస్ట్ జాయింట్ ఫీచర్ మల్టీస్టారర్ గా ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్‌టౌన్ పిక్చర్స్ ఎల్ ఎల్పీ ఫిల్మ్ సంయుక్త నిర్మాణంలో రూపొందనుంది.
 
చెన్నై బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ ఓల్డ్‌ టౌన్ పిక్చర్స్.. హైదరాబాద్‌ బేస్డ్ పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేతులు కలిపి సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్‌, అన్ని ఫార్మాట్‌ లలో సహకారం అందించనున్నారు. పెంగ్విన్ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ రచన, దర్శకత్వంలో హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ప్రాంతంలో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం డెవలప్మెంట్ నిర్మాణ భాగస్వామ్యాన్ని ప్రారంభించారు.  
 
 ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ పాన్ ఇండియా చిత్రంలో తెలుగు నుండి సత్యదేవ్, కన్నడ నుండి ధనంజయ, తమిళం నుండి సత్యరాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతంగా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
 
ప్రియా భవానీ శంకర్, సత్య అకల, సునీల్ వర్మ, జెనిఫర్ పిచినెటో ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండవ షెడ్యూల్ నవంబర్ 21 నుండి ప్రారంభమైయింది. ఫిబ్రవరి మొదటివారం 2023 వరకు షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వేసవిలో విడుదల చేయనున్నారు.
 
“క్యాలిటీ జానర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించడం కోసం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌ తో కలిసి పని చేయడం ఆనందంగా వుంది''అన్నారు ఎస్.ఎన్  రెడ్డి (పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్,)
 
మా అసోసియేషన్ నాణ్యమైన, అత్యున్నత చిత్రాలను అందించడానికి పాజిటివ్ మైండ్ సెట్ ని అందించింది. ఇటివల కాలంలో మంచి స్క్రిప్ట్ లు హద్దులు చెరిపాయి. మేమూ ఆ దిశగా కలిసి పనిచేస్తాం''  అన్నారు బాల సుందరం (ఓల్డ్‌టౌన్ పిక్చర్స్).
 
ఈ చిత్రానికి నిర్మాతలు - ఎస్ ఎన్.రెడ్డి (పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్), బాల సుందరం & దినేష్ సుందరం (ఓల్డ్‌టౌన్ పిక్చర్స్). సుమన్ ప్రసార బాగే సహ నిర్మాత.
 
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తిక్ . ఫోటోగ్రఫీ : మణికంఠన్ కృష్ణమాచారి, డైలాగ్స్: మీరాఖ్ , ఎడిటర్ : అనిల్ క్రిష్ , యాక్షన్: రాబిన్ సుబ్బు మాస్టర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యాలో లాండ్‌ అయిన పుష్ప టీమ్‌కు ఘనస్వాగతం