Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యాలో లాండ్‌ అయిన పుష్ప టీమ్‌కు ఘనస్వాగతం

Advertiesment
Allurajun in russia
, బుధవారం, 30 నవంబరు 2022 (12:59 IST)
Allurajun in russia
ఇప్పుడు తెలుగు సినిమా ఎల్లలు దాటింది. ఒకప్పుడు హాలీవుడ్‌ సినిమాలు అన్ని భాషల్లో డబ్‌ అయ్యేవి. వాటిని చూసేవారం. చైనా, జపాన్‌, రష్యా, కొరియన్‌ భాషల్లో సినిమాలు సీడీలు చూసి వాటినుంచి కథలు రాసుకునేవారు దర్శకులు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రాజమౌళి పుణ్యమా అని, మరోవైపు కరోనా కారణంగా కథల్లో కొత్తవి పుట్టుకొచ్చాయి.
 
webdunia
Rashimika in russia
తాజాగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాను జపాన్‌లో విడుదలచేస్తూ, ఆ సందర్భంగా ఆ చిత టీమ్‌ అంతా కలిసి వెళ్ళారు. అక్కడ స్కూల్‌ విద్యార్థులను కలిశారు. ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చరణ్‌, రాజమౌళి కుటుంబం అంతా వారితో ఇంట్రాక్ట్‌ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో పుష్ప టీమ్‌ పయనిస్తోంది. పుష్ప సినిమాను రష్యాలో డబ్‌ చేశారు. రష్యన్‌ ప్రతినిధులు అల్లు అర్జున్‌, రశ్మిక మందన్నా, సుకుమార్‌, దేవీప్రసాద్‌ తదితరులను సాదారంగా ఆహ్వానించారు. 
 
webdunia
Sukumar, devi in russia
డిసెంబర్ 1వ తేదీన మాస్కోలో,  డిసెంబర్ 3వ తేదీన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే రష్యన్ భాష ప్రత్యేక ప్రీమియర్‌లలో బృందాన్ని కలవనున్నారు.  రేపు అక్కడ రష్యన్‌ ప్రేక్షకులతో ఇంట్రాక్ట్‌ కానున్నారు. డిసెంబర్ 8 నుండి అన్ని చోట్ల ప్రదర్శించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్‌తో ప్రేమా లేదు దోమా లేదు.. ఆ వార్తలకు చెక్.. కృతిసనన్