కట్టుకున్న భార్య ప్రియుడితో సరసాలు.. భర్త ఏం చేశాడంటే?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:28 IST)
కట్టుకున్న భార్య తనను వదిలేసి ప్రియుడితో మరో ఇంట్లో ప్రేమ కలాపాలు సాగించడాన్ని జీర్ణించుకోలేని భర్త ప్రియుడిని చంపేశాడు. అడ్డుపడిన భార్యను కూడా గాయపరిచాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువొత్తియూరు ఏరియాలో ఉన్న శ్రీపెరంబదూరు ప్రాంతానికి చెందిన బాలాజీ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
భార్య వనిత, ఏడాదిన్నర కొడుకుతో కలిసి మణిమంగళం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గణపతి అనే వ్యక్తితో వినితకు పరిచయం ఏర్పడింది. బాలాజీ ఇంట్లో లేని సమయంలో గణపతి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తాను ఇంట్లో లేని సమయంలో గణపతి రావడం గమనించిన భర్త భార్యను మందలించాడు. అయినా వినకుండా వనిత ప్రేమ కలాపాలను సాగించింది. వారం రోజుల క్రిందట ప్రియుడితో కలిసి లేచిపోయింది. 
 
ఈ విషయం గ్రామమంతా అల్లుకుంది. ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత శ్రీపెరంబదూరులోని గుండు పెరుంబేడులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టు తెలుసుకున్నాడు బాలాజీ. అవమానం భరించలేని బాలాజీ గణపతిని ఎలాగైనా చంపేయాలని నిశ్చయించుకున్నాడు. స్నేహితులతో కలిసి తెల్లవారుజామున వాళ్లు ఉండే ఇంటికి వెళ్లాడు. అందరూ గణపతిని చుట్టుముట్టి కత్తితో దాడి చేసారు. 
 
శరీరంపై పోట్లు పొడిచారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రియురాలికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు అక్కడ నుండి పరారయ్యారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. గణపతి అప్పటికే చనిపోగా వనిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments