Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు అక్రమ రవాణా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (17:34 IST)
ఇటీవలి కాలంలో హైరాబాద్ నగరంలో మత్తుమందు పదార్థాలను అక్రమంగా తరలించే వారిలో ఆఫ్రికన్ మహిళలు పట్టుబడుతున్నారు. ఇటీవల గోవా నుంచి మాదకద్రవ్యాలను తరలిస్తూ హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా హల్‌చల్ చేసింది. అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేరెడ్‌మెట్‌ వద్ద వాహన తినిఖీలు నిర్వహిస్తుండగా మాదకద్రవ్యాల ముఠా పోలీసులకు చిక్కింది. వారి నుంచి భారీగా కొకైన్‌, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోటి రూపాయల వరకూ ఉండవచ్చని అంచనా వేసారు. 
 
ఏపీ, తెలంగాణలలో గత కొంతకాలంగా ఈ ముఠా వ్యాపారాన్ని కొనసాగిస్తోందని విచారణలో వెల్లడైంది. ఇతర ప్రాంతాల నుండి కొకైన్‌, హెరాయిన్‌ను తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని తేలింది. పట్టుబడిన నలుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరికి మాదకద్రవ్యాలు ఎక్కడ నుండి వస్తున్నాయి. ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments