Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (10:42 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. సీఎం ఇంటిని బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని అగంతకులు బెదిరించారు. ఈ మేరకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎగ్మోర్ పోలీస్ కంట్రోల్ రూంకు వచ్చాయి. సీఎం స్టాలిన్ ఇంటి వద్ద బాంబు పెట్టామని మరికొద్ది సేపట్లో పేలుతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్, పోలీస్ జాగిలాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని అణువణువు తనిఖీ చేశారు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఆ తర్వాత కంట్రోల్ రూమ్‌ ఫోన్ చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో నిందితుడిని గుర్తించారు. తిరునెల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తామరైకన్నన్ అనే వ్యక్తి ఈ ఫోన్ కాన్ చేసినట్టు నిర్ధారించి అరెస్టు చేశారు. గంజాయి మత్తులో ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments