Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చుని ఫోన్ మాట్లాడాడు.. తరుముకున్న రైల్వే డ్రైవర్ (video)

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (17:19 IST)
Railway Track
అవును.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ వాటితో గడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బండి నడిపేటప్పుడు స్మార్ట్ ఫోన్లలో మాట్లాడవద్దని ఎన్ని రూల్స్ పెట్టినా.. అవన్నీ ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేరు చాలామంది. 
 
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. కట్ చేస్తే.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఏకంగా రైలు పట్టాలపై కూర్చుని ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు. వేరే మార్గం లేకపోవడంతో, డ్రైవర్ రైలును ఆపవలసి వచ్చింది. ఆ వ్యక్తి రైలు తన ముందు ఆగిందని గమనించినప్పుడు మాత్రమే పారిపోయాడు. అయితే, డ్రైవర్ దిగి అతనిపై రాయి విసిరాడు. కానీ ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
 
ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక ఆగంతకుడు తన సెల్ ఫోనులో బంధించిన ఈ వీడియోపై రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments