Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ అంటే.. గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్.. నోట్ల రద్దు అమానుషం: మమత ఫైర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన జీఎస్టీకి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కొత్త పేరు పెట్టారు. జీఎస్టీ అంటే గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ అని మమత బెనర్జీ కొత్త అర్థాన్నిచ్చారు

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (17:02 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన జీఎస్టీకి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కొత్త పేరు పెట్టారు. జీఎస్టీ అంటే గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ అని మమత బెనర్జీ కొత్త అర్థాన్నిచ్చారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టి.. ఆర్థిక రంగాన్ని అంతం చేసే పన్ను అని ఆమె పేర్కొన్నారు.

ఉద్యోగాలను లాక్కునేందుకు, వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే ఈ జీఎస్టీని విధించారని మమత ధ్వజమెత్తారు. అలాగే ప్ర‌భుత్వం అమ‌లు చేసిన నోట్ల ర‌ద్దు అమానుష‌మని, అందుకు వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్ 8న ప్ర‌తి ఒక్క‌రూ నిర‌స‌న తెలియ‌జేయాల‌ని మమత పిలుపునిచ్చారు. ఆ రోజున అంద‌రూ త‌మ ట్విట్ట‌ర్‌ ఖాతాలో న‌లుపు రంగును ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
 
ఇదిలా ఉంటే.. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా విమర్శించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జీఎస్టీపై ఫైర్ అయ్యారు. దేశ ప్రజల పట్ల జీఎస్టీ ఓ విలన్‌గా మారిందన్నారు.

కొత్త పన్ను విధానం జీఎస్టీ ద్వారా లక్షల మంది చిన్న వ్యాపారులు రోడ్డున్న పడ్డారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ డైరెక్ట్‌గా ఎదురుదాడికి దిగారు. గుజరాత్ ప్రజలకు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం కావాలని, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమీ ఇవ్వడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments