Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను గుండెలపై కట్టుకుని సరస్సులో దూకిన తల్లి

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (09:39 IST)
ఆ మహిళకు అనుమానపు భయం వేధించింది. పరీక్షల్లో తప్పుతానన్న భయంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తనతో పాటు.. అభంశుభం తెలియని కన్నబిడ్డను కూడా చంపేసింది. మహారాష్ట్రలోని  చంద్రాపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
చంద్రాపూర్‌కు చెందిన రూపాలి గజ్జెవార్ అనే మహిళ గత యేడాది బీకాం ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసి ఫెయిలైంది. దీంతో ఈనెల 19వ తేదీన పరీక్షకు మళ్లీ హాజరైంది. ఈసారి కూడా పరీక్ష సరిగా రాయలేదు. దీంతో మళ్లీ పరీక్ష తప్పుతానన్న అనుమానం ఆమెను వెంటాడింది. 
 
దీంతో పరీక్షా కేంద్రం నుంచి నేరుగా ఇంటికివెళ్లి అక్కడ నుంచి తన ఐదేళ్ళ కుమారుడుని తీసుకుని స్థానికంగా ఉండే సరస్సు వద్దకు వెళ్లింది. అక్కడ తన గుండెలపై బిడ్డను కట్టుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fahadh Faasil: ఏడీహెచ్డీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఫహద్ ఫాసిల్

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. జూ.ఎన్టీఆర్ షాక్

దర్శకుడు శంకర్ సినిమాల ఫెయిల్యూర్‌‍కు కారణం ఆవిడేనా?

'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ కలెక్షన్లు కుమ్మేస్తున్నారు...

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు... ఆస్పత్రిలో అడ్మిట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments