Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంశోద్ధారకుడి కోసం చావని ఆశ... ప్రాణం తీసిన ప్రసవం

Advertiesment
వంశోద్ధారకుడి కోసం చావని ఆశ... ప్రాణం తీసిన ప్రసవం
, బుధవారం, 21 నవంబరు 2018 (14:25 IST)
ఓ మాతృమూర్తి ఆశ అడియాశలై పోయింది. వంశోద్ధారకుడు ఉంటేనే పున్నామనరకం నుంచి తప్పిస్తాడనే వెర్రి ఆశ ఓ మాతృమూర్తి ప్రాణం తీసింది. ఫలితంగా ఆరుగురు ఆడబిడ్డలు అనాథలుగా మారారు. 
 
ఒకరిద్దరూ బిడ్డలను పెంచి పోషించేందుకే అష్టకష్టాలు పడుతున్న ఈ రోజుల్లో మగపిల్లాడు పుట్టాలనే ఆశతో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఈ ఆరు కాన్పులతో ఆమె శక్తి హరించుకునిపోయింది. అయినప్పటికీ.. వంశోద్ధారకుడు కోసం ఆశ చావని ఆ తల్లి ఆరో కాన్పులోనైనా పుడతాడని ఆశపడింది. అయితే, అదే ఆమెకు చివరి కాన్పు అవుతుందని ఊహించలేక పోయింది. మరో ఆడబిడ్డకు జన్మనిచ్చి అసువులు బాసింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా గురజాలలో జరిగింది. 
 
స్థానిక దళితవాడకు చెందిన చిలుకూరి మేరీ సునీత అనే 26 యేళ్ళ మహిళ కూలీనాలి చేసుకుంటూ జీవిస్తోంది. ఈమె భర్త రిక్షాకార్మికుడు. వీరికి పదేళ్ళ క్రితం వివాహం కాగా ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. కానీ వంశోద్ధారకుడుకి కోసం ఆ దంపతులు పరితపించారు. తనలోని శక్తి హరించుకుని పోయినా ఆ తల్లి ఆరో కాన్పుకు సిద్ధపడింది. కానీ అదే చివరి కాన్పు అవుతుందని ఆమె గ్రహించలేక పోయింది. ఆరో కాన్పులో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మేరీ సునీత కన్నుమూసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్‌ఫోన్‌ను ఈ-షాపింగ్‌లో కొంటున్నారా?