మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
టిప్పర్‌పై కూర్చున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు. టిప్పర్ ఐరన్ లోడుతో ప్రయాణిస్తుండగా, కూలీలు ఐరన్ లోడుపై కూర్చున్నారు. వారందరూ సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.