Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపే ‘మహా’ బలపరీక్ష.. సుప్రీం ఆదేశాలు.. ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (13:27 IST)
‘మహా’ రాజకీయంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్ష కోసం వారం రోజులు ఆగాల్సిన అవసరంలేదని చెప్పింది. రేపు అనగా నవంబర్ 27న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోగా ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా విశ్వాస పరీక్ష నిర్వహించాలని చెప్పింది. ఆ కార్యక్రమాన్ని అంతా వీడియో తీయాలని కూడా ఆదేశించింది. 
 
అందుకోసం సభ్యులందరూ కలిసి ప్రొటెం స్పీకర్ ఎన్నుకోవాలని చెప్పింది. ప్రొటెం స్పీకర్ పర్యవేక్షణలోనే బల పరీక్ష జరపాలని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ పార్టీలు రాజ్యాంగం యొక్క విలువను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎన్. వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తన తీర్పును వెలువరించింది.
 
బలపరీక్ష నేపథ్యంలో.. కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు ప్రకటించింది. 
 
అంతేకాకుండా 162 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై ఒక బల ప్రదర్శనను కూడా నిర్వహించాయి. కాగా.. బీజేపీ కూడా తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రకటించింది. దీంతో రేపటి బలపరీక్షలో ఎవరు నెగ్గుతారో.. ఎవరు ఓడుతారో తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments