Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య క్లినిక్ కేంద్రంగా వ్యభిచారం .. సూత్రధారి మహిళా డాక్టర్

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (15:11 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఓ మహిళా వైద్యురాలు తన వైద్య క్లినిక్ కేంద్రంగా వ్యభిచారిణులతో అక్రమంగా వ్యభిచారం చేయిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక పోలీసులు.. ఓ లేడీ కానిస్టేబుల్‌తో ఈ వ్యభిచార రాకెట్ గుట్టును బహిర్గతం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్ నగరంలోని బర్ఖేడి ప్రాంతానికి చెందిన గాయత్రి సింగ్ (52) అనే మహిళ వైద్య విద్యను అభ్యసించారు. యునానీ మెడిసిన్, సర్జరీలో డిగ్రీ చదివారు. ఆమె భోపాల్ నగరంలో అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంలో సొంతంగా ఓ క్లినిక్‌ను ప్రారంభించారు.
 
అయితే, ఆమె వద్దకు రోగులు పెద్దగా రాకపోవడంతో డబ్బు సంపాదనకు అడ్డదారులు తొక్కింది. ఇందులోభాగంగా, క్లినిక్ మాటున వ్యభిచారిణులతో రాకెట్ నడుపసాగింది. ఈ రాకెట్ గురించి పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. బర్ఖేడ నివాసులు కొందరు క్లినిక్ మాటున వ్యభిచారం రాకెట్ నడుపుతున్నారని డీజీపీ వీకేసింగ్‌కు సమాచారం అందించారు. దీంతో డీజీపీ ఈ సమాచారాన్ని భోపాల్ క్రైంబ్రాంచ్ పోలీసులకు చేరవేశారు.
 
ఆ తర్వాత స్థానిక పోలీసులు ఈ క్లినిక్‌పై నిఘా వేసి... మారువేషంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఆమె వద్దకు పంపించారు. తనకు అత్యవసరంగా క్లినిక్‌లో ఉద్యోగం కావాలని వచ్చిన మహిళా కానిస్టేబుల్‌కు వ్యభిచారం చేయమని మహిళా డాక్టరు కోరింది. దీంతో మహిళా కానిస్టేబుల్ అందించిన సమాచారం మేరకు పోలీసు బృందం దాడి చేసి నలుగురు వ్యభిచారిణులు, ఆరుగురు విటులతో పాటు మహిళా వైద్యురాలిని కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments