స్పా మాటును వ్యభిచారం... ఆరుగురు మహిళలతో....

శనివారం, 22 ఫిబ్రవరి 2020 (10:40 IST)
బెంగుళూరులో మరో వ్యభిచారగుట్టును పోలీసులు రట్టుచేశారు. స్పా మాటున గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తూ వచ్చిన ఈ గట్టును పోలీసులు పక్కా ప్లాన్‌తో వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగా పలువురు అమ్మాయిలను, విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
బెంగళూరు నగరంలోని మహదేవపుర ప్రాంతంలోని హూడీ గ్రామంలో ఓ స్పాను ఇటీవల కొందరు నెలకొల్పారు. ఇందులో ఆరుగురు మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. 
 
దీంతో సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి వ్యభిచారం రొంపి నుంచి ఆరుగురు మహిళలను కాపాడారు. స్పా నిర్వాహకులైన ముగ్గురు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్పా బాగోతంపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 26న మంత్రివర్గ భేటీ... రాజధాని మార్పుపై ఆర్డినెన్స్?