Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

26న మంత్రివర్గ భేటీ... రాజధాని మార్పుపై ఆర్డినెన్స్?

26న మంత్రివర్గ భేటీ... రాజధాని మార్పుపై ఆర్డినెన్స్?
, శనివారం, 22 ఫిబ్రవరి 2020 (10:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 26వ తేదీ బుధవారం జరుగనుంది. ఇందులో అత్యంత కీలకమైన అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టు రద్దు బిల్లులపై ప్రత్యేక ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 
 
నిజానికి ఈ నెల 12వ తేదీన (రెండో బుధవారం) సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు అభ్యర్ధులెవరైనా పాల్పడితే.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాతా అనర్హుడిగా ప్రకటించేలా ఆర్డినెన్సు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్సు కూడా ఇచ్చారు. 
 
స్థానిక ఎన్నికల తర్వాతే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిద్దామని మంత్రులకు సీఎం ఆ సందర్భంగా చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ.. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉండటంతో.. 26న జరిగే కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా మొబైల్మా - ఆటోమొబైల్ మార్కెట్‌పై కరోనా వైరస్ పంజా