Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పరీక్షలు చేయించుకోమన్నందుకు ఎస్ఐ తల పగిలింది.. ఎక్కడ?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:08 IST)
ఇతర ప్రాంతాల నుంచి తమ సొంతూళ్ళకు వచ్చే వారికి స్థానిక వైద్య శాఖ అధికారులు విధిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు సాఫీగానే సాగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కొందరు మూర్ఖులు పరీక్షలు చేయించుకోమని కోరినందుకు వైద్య సిబ్బందితో పాటు.. వారి వెంట వెళ్లే పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ గ్రామానికి వచ్చిన యువకుడిని కరోనా పరీక్షలు చేసుకోవాలని ఓ ఎస్ఐ కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు ఏఎస్ఐ తల పగులగొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షోపూర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షోపూర్‌ జిల్లాలోని గాస్వాని గ్రామానికి చెందిన గోపాల్‌ శివ్‌హరే (21) అనే యువకుడు ఇటీవల ఇండోర్‌ నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా వెలుగు చూసిన నగరంగా ఇండోర్ గుర్తింపుపొందింది. ఇండోర్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఇండోర్ నుంచి స్వగ్రామానికి రావడంతో స్థానికులు ఆందోళన చెందసాగారు. పైగా, ఈ విషయం తెలిసిన స్థానిక వైద్యబృందం గోపాల్‌ ఇంటికెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరింది. అయితే, గోపాల్‌ బాగానే ఉన్నాడనీ, ఎలాంటి పరీక్షలు  అవసరం లేదంటూ అతని కుటుంబసభ్యులు వైద్య బృందంపై దాడికి దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గోపాల్‌ ఇంటికెళ్లి నచ్చచెప్పినా వినలేదు. ఖచ్చితంగా పరీక్షలు చేసుకోవాల్సిందేనన్న పోలీసులపై గోపాల్‌ కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏఎస్‌ఐ శ్రీరామ్‌ అవస్థి (52) తలకు తీవ్ర గాయమైంది. గోపాల్‌ కుటుంబపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments