Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో అక్రమ సంబంధం.. యువకుడి మర్మాంగం కోసిన ప్రియుడు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:09 IST)
తన ప్రియురాలితో ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి మరో ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి ప్రియురాలితో అక్రమ సంబధం పెట్టుకున్న యువకుడి మర్మాంగాన్ని కోసేశాడు. ఆపై హత్య చేశాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తిరుపత్తూరుకు చెందిన శివకుమార్‌కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల స్థానికంగా ఉండే కుట్టి అమ్మాల్ అనే స్త్రీతో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. ఇదిలావుండగా, ఆమెకు ఇదివరకే భర్త చనిపోయి ఉన్నాడు. శివకుమార్ పరిచయంకాకముందు ఆమె పళని పూంగుళం అనే వ్యక్తితో రంకు సాగించింది. 
 
వ్యాపారం నిమిత్తం అతను కొన్నాళ్ల క్రితం విదేశాలకు వెళ్లాడు. ఈ మధ్యలో శివకుమార్‌ని వలలో వేసుకుంది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన పూంగుళానికి విషయం తెలిసింది. శివకుమార్ అడ్డు తొలగించుకోవాలని వ్యూహం పన్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శివ కుమార్ పని నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కొంతమంది దుండగులు అతని కళ్లలో కారం కొట్టారు. క్రింద పడేసి మర్మాంగాలు కోసేశారు. ప్రక్కనే ఉన్న బండను ఎత్తి తలపై కొట్టి చంపేశారు. ఇది పూంగుళం పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments