అమర జావన్లకు అద్భుత నివాళి.. శరీరమంతా టాటూ రూపంలో 71 మంది పేర్లు

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (20:00 IST)
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారతీయుల్లో విపరీతమైన ఆగ్రహం, ఆవేశం పెల్లుబుకుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడడమే కాదు, పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ముఖ్యంగా యువతీయువకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బికనీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సహరన్ అనే యువకుడు అమరవీరులకు సరికొత్తగా నివాళులు అర్పించాడు. 
 
ఇప్పటివరకు ఉగ్రదాడుల్లో మరణించిన 71 మంది అమర జవాన్ల పేర్లను తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కోసం తాను టాటూ వేయించుకున్నట్టు గోపాల్ తెలిపాడు. గోపాల్ బికనీర్ ప్రాంతంలో ఎంతో క్రియాశీలకంగా ఉన్న భగత్ సింగ్ యూత్ బ్రిగేడ్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఏదైనా వినూత్న రీతిలో నివాళులు అర్పించాలని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావించి ఇలా జవాన్ల పేర్లతో టాటూ వేయించుకున్నానని తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుజ్జీవం...