Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్నాలజీ పెరిగినా నో యూజ్.. "గే'' భాగస్వామి కోసం ఇలా చేశాడు..

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే క్రమంలో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి కోసం మరో యువకుడు ప్రాణాలు అర్పించాడు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (15:00 IST)
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే క్రమంలో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి కోసం మరో యువకుడు ప్రాణాలు అర్పించాడు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, నానో టెక్నాలజీ రీసెర్చర్‌గా ఉన్న నీలోప్తల్ సర్కార్ (27).. తన గే భాగస్వామి ప్రాణాలు కాపాడటం కోసం ఆదివారం అప్పర్ లేక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కాళికాదేవిపై అమితమైన భక్తి విశ్వాసాలను చూపే నీలోత్పల్.. చనిపోయేందుకు ముందు శాస్త్రవేత్తలను ఉద్దేశించి లేఖ రాశాడు. ఫేస్ బుక్‌లోనూ వీడియో పోస్టు చేశాడు. కానీ అతన్ని కనుగొనేలోపే చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో గౌహతీలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి.. ఆపై నదిలో దూకేందుకు ఇతడు ప్రయత్నించగా.. నీలోత్పల్‌ను స్థానికులు కాపాడారు. 
 
అయితే తన గే భాగస్వామి అనారోగ్యంతో బాధపడుతుంటే.. తన చావు అతడిని కాపాడుతుందనే ఉద్దేశంతో నీలోత్పల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో జన్మలో తన భాగస్వామితో కలుస్తానని ఆ లేఖలో నీలోత్పల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments