Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాయత్రి సినిమా రివ్యూ: ఆ ప్రేక్షకులకు ఓకే.. మోహన్ బాబు, శ్రియ, విష్ణు నటన అదుర్స్

మోహ‌న్‌బాబు శివాజీగానూ, గాయ‌త్రీ ప‌టేల్‌గానూ రెండు పాత్ర‌ల్లోనూ మెప్పించారు. ఫైట్స్ బాగున్నాయి. త‌న‌దైన స్టైల్లో చెప్పిన ఈశ్వ‌ర‌స్తుతి, డైలాగులు మెప్పించాయి. కుర్చీలో కూర్చుని చేసిన ఫైట్‌, మార్కెట్‌లో

Advertiesment
గాయత్రి సినిమా రివ్యూ: ఆ ప్రేక్షకులకు ఓకే.. మోహన్ బాబు, శ్రియ, విష్ణు నటన అదుర్స్
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (14:48 IST)
తారాగ‌ణం: మ‌ంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియా శ‌ర‌న్‌, నిఖిలా విమ‌ల్‌, అన‌సూయ‌, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: మదన్ రామిగాని
ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి
క‌ళ‌: చిన్నా
కూర్పు: ఎం.ఎల్.వర్మ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాణ సంస్థ: ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌
 
విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన మోహన్‌బాబు ''గాయత్రి'' సినిమాతో మళ్లీ తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు . విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన మోహన్‌బాబు.. 2015లో ''మామ మంచు అల్లుడు కంచు'' సినిమాకు తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు.  తాజాగా స్వంత నిర్మాణ సంస్థ‌లో ''గాయత్రి'' సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన మోహన్ బాబు.. నటనతో మంచి మార్కులు వేయించుకున్నారని విడుదల రోజైన శుక్రవారం (ఫిబ్రవరి 9) పాజిటివ్ టాక్ వచ్చింది. మోహన్ బాబు గాయత్రిలో ఒకటి పాజిటివ్ రోల్ పోషించగా, మరొకటి పాజిటివ్ రోల్‌లో కనిపించారు.
 
క‌థ‌లోకి వెళ్తే.. 
మోహ‌న్‌బాబు శివాజీగానూ, గాయ‌త్రీ ప‌టేల్‌గానూ రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఇద్దరూ చూసేందుకు ఒకేలా వుంటారు. ఇందులో శివాజీ స్టేజీ ఆర్టిస్టు. అతని నటనకు శారద ఫిదా అవుతుంది. వారిద్దరూ ప్రేమించి వివాహం చేసుకుంటారు. ఈ వివాహాన్ని శారద తండ్రి వైభవంగా చేయిస్తాడు. కానీ శార‌ద తండ్రి అతి మంచిత‌నం వ‌ల్ల ఉన్న ఆస్తుల‌న్నీ పోగొట్టుకుంటాడు. అత‌ను కూడా చివరికి కన్నుమూయడంతో ఉన్న ఇల్లు కూడా జప్తు అవుతుంది. 
 
శార‌ద త‌న భ‌ర్త‌తో పాటు కొత్త ఇంటికి చేరుకుంటుంది. శారద సూచనల మేరకు శివాజీ నటనలో రాణిస్తాడు. అయితే శార‌ద అనారోగ్యం బారిన పడుతుంది. ఆమె చికిత్స కోసం లక్ష రూపాయలు కావాల్సి వస్తుంది. శివాజీ నిజ జీవితంలో మ‌రో వ్య‌క్తిగా న‌టించి జైలు పాల‌వుతాడు. తిరిగి వ‌చ్చేస‌రికి అత‌ని భార్య చ‌నిపోయింద‌ని, పుట్టిన పాప అనాథ ఆశ్ర‌మానికి చేరుకుంద‌ని తెలుస్తుంది. అప్ప‌టినుంచి ఆ పాప కోసం గాలిస్తుంటాడు. త‌న బిడ్డ‌లాంటి అనాథ పిల్ల‌ల కోసం శార‌దా స‌ద‌న్‌ను నిర్వ‌హిస్తుంటాడు. 
 
త‌ప్పిపోయిన పిల్ల‌ల‌ను కాపాడి వాళ్ల త‌ల్లిదండ్రులకు అప్ప‌గిస్తుంటాడు. స‌ద‌న్ నిర్వ‌హణ కోసం మారు వేషాలు వేస్తూ జైలుకు వెళ్తుంటాడు. ఆ క్ర‌మంలోనే అత‌నికి గాయ‌త్రీ ప‌టేల్ (మోహ‌న్‌బాబు) ప‌రిచ‌య‌మ‌వుతాడు. శివాజీ, గాయ‌త్రీప‌టేల్ చూడ్డానికి ఒక‌టే ర‌కంగా ఉంటారు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య ఓ ఒప్పందం కుదురుతుంది. కానీ ఆ ఒప్పందంలో శివాజీ మోసపోతాడు. ఇందుకు కారణం శివాజీ కుమార్తే అవుతుంది. ఆమె ఎందుకలా చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేష‌ణ‌
మోహ‌న్‌బాబు శివాజీగానూ, గాయ‌త్రీ ప‌టేల్‌గానూ రెండు పాత్ర‌ల్లోనూ మెప్పించారు. ఫైట్స్ బాగున్నాయి. త‌న‌దైన స్టైల్లో చెప్పిన ఈశ్వ‌ర‌స్తుతి, డైలాగులు మెప్పించాయి. కుర్చీలో కూర్చుని చేసిన ఫైట్‌, మార్కెట్‌లో జ‌రిగిన ఫైట్‌, క్లైమాక్స్ ఫైట్ల‌ను కంపోజ్ చేసిన తీరు బావుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో విష్ణు, శ్రియ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మెప్పించాయి. 
 
అలీ, బ్ర‌హ్మానందం కామెడీలు మెప్పించ‌లేదు. అన‌సూయ రొటీన్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో చూడొచ్చు. డైలాగులు బావున్నాయి. జ‌డ్జి పాత్ర‌లో కోట శ్రీనివాస‌రావు, ఫ్రెండ్‌గా శివ‌ప్ర‌సాద్, శేఖ‌ర్ పాత్ర‌లో రాజా రవీంద్ర‌, మినిస్ట‌ర్‌గా పృథ్వి, లాయ‌ర్‌గా పోసాని, జైల‌ర్‌గా నాగినీడు, పోలీస్‌గా స‌త్యం రాజేశ్‌ త‌మ త‌మ పాత్ర‌లకు న్యాయం చేశారు. మొత్తానికి కుటుంబ కథా చిత్రంలో గాయత్రి అలరిస్తుంది. 
 
ప్లస్ పాయింట్స్ 
మోహన్‌బాబు, విష్ణు, శ్రియ నటన
కుర్చీ, మార్కెట్‌, క్లైమాక్స్ ఫైట్లు
డైలాగులు
 
మైన‌స్ పాయింట్లు
కామెడీ
ఫ‌స్టాఫ్ సాగ‌దీత‌ 
కొత్తదనం మిస్సింగ్ 
 
రేటింగ్‌: 2.75.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిధరమ్ తేజ్ 'ఇంటెలిజెంట్' ఔనా? కాదా? (రివ్యూ రిపోర్ట్)