Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనసూయను కౌగిలించుకున్నాను.. కానీ శ్రియను వదిలేశాను: మోహన్ బాబు

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సినీ నటి శ్రియను విలక్షణ నటుడు మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు. లక్ష్మీ ప్రసన్న పతాకంపై రూపుదిద్దుకున్న సినిమా ''గాయత్రి'' ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. తా

Advertiesment
అనసూయను కౌగిలించుకున్నాను.. కానీ శ్రియను వదిలేశాను: మోహన్ బాబు
, సోమవారం, 29 జనవరి 2018 (12:13 IST)
''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సినీ నటి శ్రియను విలక్షణ నటుడు మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు. లక్ష్మీ ప్రసన్న పతాకంపై రూపుదిద్దుకున్న సినిమా ''గాయత్రి'' ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో శ్రియ సినిమాలు చూశానని సరాదాగా కామెంట్ చేశారు. 
 
తన బ్యానర్‌లో ఎంతోమంది హీరోయిన్లు నటించారని... కానీ, శ్రియ అత్యద్భుతంగా నటించిందని తెలిపారు. విష్ణు, శ్రియ జంటను చూస్తే ఈ చిత్రంలో ఓ కావ్యంగా కనిపిస్తుందని మోహన్ బాబు కామెంట్ చేశారు. ప్రతి సన్నివేశంలోనూ శ్రియ కనబరిచిన నటన భేష్, అమోఘమని చెప్పారు. 
 
అలాగే మోహన్ బాబు శ్రియ గురించి సరదా కామెంట్ చేశారు. విష్ణు సరసన నటించింది కాబట్టి తాను వదిలేశానని, తనకు కూడా శ్రియను కౌగిలించుకోవాలనే ఉందన్నాపు. యాంకర్ అనసూయను కౌగిలించుకోగలను కానీ, శ్రియను కౌగిలించుకుంటే విష్ణు సీరియస్ అవుతాడని.. మిన్నకుండిపోయానని చెప్పుకొచ్చారు. 'గాయత్రి' సినిమాలో శ్రియ నటన ఇప్పటి జనరేషన్‌లో మరో హీరోయిన్ చేయలేదని కితాబిచ్చారు. 
 
ఇక మంచు విష్ణు కూడా శ్రియతో పోటీపడి నటించాడని మోహన్ బాబు ప్రశింసించారు. తనతో నటించడం కష్టమని.. అలాంటిది.. గాయత్రి సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో విష్ణు, శ్రియ అద్భుతంగా నటించారని.. ఎక్కడా నటనలో రాజీపడలేదని కొనియాడారు. శ్రియ గురించి రెండు గంటలు చెప్పినా సరిపోదని, ఈ రోల్‌లో మంచు విష్ణు కంటతడి పెట్టించాడన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు : పూనమ్ కౌర్ కౌంటర్