Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్సా కోసం ఓ ప్రేమ జంట చోరీల బాట.. ఓనర్స్‌ను ఏమార్చి..?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (17:32 IST)
జల్సా కోసం ఓ ప్రేమ జంట చోరీల బాట పట్టింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి.. ఓనర్స్‌ను ఏమార్చి.. ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దొంగిలించేవారు.  కర్ణాటక బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంట దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరికీ 3 సంవత్సరాల క్రితం పరిచయమైంది. 
 
వినయ్​పై ఓ హత్య కేసుతో పాటు.. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడని.. ఇప్పటికే రౌడీషీట్ ఉందని పోలీసులు తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. అతడిని లవ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ క్రైమ్ కపుల్.. ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయిస్‌గా పరిచయం చేసుకొని ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. 
 
అనంతరం ఓనర్ దృష్టిని మరల్చి ఒక మొబైల్​ఫోన్, ల్యాప్​టాప్, రూ.15 వేల నగదును దొంగిలించారు. తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓనర్ ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments