వేధింపులు.. దుస్తులు మార్చేటప్పుడు గదిలోకి.. నో చెప్పడంతో.. ఉద్యోగం..?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (15:20 IST)
మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు అధికమవుతున్నాయి. అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా ఉద్యోగినికి వేధింపులు తప్పలేదు. కోరిక తీర్చమని ఓ మహిళా ఉద్యోగినిని వేధించారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. అంతే ఆమెను ఉద్యోగం నుంచి అకారణంగా తొలగించారు. ఈ ఘటన ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఓ ప్రయివేటు లాంజ్‌లో గత కొంతకాలం నుంచి ఓ మహిళ (26) ఉద్యోగం చేస్తోంది. అక్కడ డ్యూటీ మేనేజర్‌తో పాటు జనరల్ మేనేజర్ కలిసి.. మహిళా ఉద్యోగినిని లైంగిక వేధింపులకు గురి చేశారు. తమ కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చారు. కానీ ఆమె మేనేజర్ల ప్రతిపాదనను తిరస్కరించింది.
 
గత ఆరు నెలల నుంచి ఆ ఉద్యోగినిని ఏదో రకంగా హింసిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆమె తన దుస్తులు మార్చుకుంటున్న సమయంలో.. ఆ గదిలోకి జనరల్ మేనేజర్ వెళ్లాడు. ఆమెపై అఘాయిత్యం చేసేందుకు యత్నించగా ప్రతిఘటించింది. 
 
అయినా వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. చివరికి  మంగళవారం ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో గురువారం ఢిల్లీ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనరల్ మేనేజర్‌తో పాటు డ్యూటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం