Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఐవీకి మందు కనిపెట్టారోచ్.. ట్రయల్స్ సక్సెస్... కానీ..?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (13:29 IST)
ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీకి మందు వచ్చేసిందట. ఎయిడ్స్ బారిన పడ్డ ఓ వ్యక్తికి సైంటిస్టులు పలు మెడిసిన్లతో చికిత్స ఇవ్వగా.. అతను విజయవంతంగా ఆ వ్యాధి నుంచి బయట పడ్డాడు. ఈ మేరకు 23వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ (ఎయిడ్స్ 2020)లో సైంటిస్టులు తమ పరిశోధనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
 
2012లో హెచ్ఐవీ బారిన పడ్డ ఓ వ్యక్తి 2016లో సైంటిస్టులు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి 48 వారాల పాటు Dolutegravir, Maraviroc అనే రెండు మెడిసిన్లను నిత్యం రెండు సార్లు 500 మిల్లీగ్రాముల మోతాదులో ఇచ్చారు. అలాగే విటమిన్ బి3 పిల్స్‌ను కూడా ఇచ్చారు.
 
అనంతరం మార్చి 2019లో అతనిపై క్లినికల్ ట్రయల్స్ ఆపేశారు. తరువాత 57 వారాల పాటు ప్రతి 3 వారాలకు ఒకసారి ఆ వ్యక్తిలో ఉన్న వైరల్ డీఎన్ఏ గురించి తెలుసుకునేందుకు టెస్టులు చేశారు. ఈ క్రమంలో 57 వారాల అనంతరం అతనిలో హెచ్ఐవీ యాంటీ బాడీలు లేవని తేలింది. అంటే.. ఆ వ్యక్తి పూర్తిగా హెచ్ఐవీ నుంచి కోలుకున్నాడని తేలింది. 
 
ఆ వ్యక్తిపై ప్రయోగం విజయవంతమైనా.. ఇప్పుడిప్పుడే ఆ మెడిసిన్లను ఎయిడ్స్ చికిత్స కోసం వాడలేమని సైంటిస్టులు చెప్తున్నారు. మరిన్ని ప్రయోగాలు చేశాకే వాటిని ఉపయోగించే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments