Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేథీ నుంచి రాహుల్ - రాయ్‌బరేలి నుంచి ప్రియాంకా పోటీ!!

ఠాగూర్
బుధవారం, 6 మార్చి 2024 (16:06 IST)
దేశంలో త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బెరేలీ నుంచి ప్రియాంకా గాంధీలు పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. గత 1967 నుంచి 2014 వరకు అమేథీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతూ వచ్చారు. ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ 2002 నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై ఆనయ ఓడిపోయారు. 
 
ఈ స్థానంలో కాంగ్రేసేతర అభ్యర్థి గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి పోటీ చేయడంతో ఆయన వయనాడ్ నుంచి విజయం సాధించి పార్లమెంట్‌‍లోకి అడుగుపెట్టారు. ఇపుడు మరోమారు ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ తెలిపారు. అదేవిధంగా ప్రియాంకా గాంధీ కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. అయితే, పార్టీ అధిష్టానం వీరిద్దరి పోటీపై ఓ స్పష్టత ఇస్తుందని ఆయన చెప్పారు.
 
మరోవైపు, స్మృతి ఇరానీ మరోమారు అమేథీ నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా, అందులో స్మృతి ఇరానీ పేరు కూడా ఉంది. బీజేపీ పెద్దలు స్మృతి ఇరానీకి మరోమారు అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments