పెళ్లి చేసుకుంటానని సహజీవనం.. గర్భం దాల్చే సరికి పారిపోయాడు..!

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (18:10 IST)
పెళ్లి చేసుకుంటానని ఒక మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి ఆమె గర్భం దాల్చే సరికి మాటమార్చి తప్పించుకు తిరగసాగాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దీంతో న్యాయం చేయమని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలియా జిల్లాలో నివసించే 29 ఏళ్ళ యువతికి 2019లో విజయనగర్‌కు చెందిన అమిత్ మౌర్య పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అమిత్ యువతితో సన్నిహితంగా మెలిగాడు.
 
ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. అప్పటి నుంచి మౌర్య ముఖం చాటేశాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. అంతేకాక ఒక అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి తనకు అశ్లీల చిత్రాలను పంపించేవాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమిత్ మౌర్యపై ఐపీసీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 376, 506,కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments