Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే : రాజస్థాన్ హైకోర్టు

Webdunia
బుధవారం, 8 మే 2019 (10:01 IST)
సహజీవనంపై రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒక స్త్రీ, పురుషుడు ఇష్టపడి సహజీవనం చేయడం, ఆ తర్వాత విడిపోవడం వంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి జంటలకు రాజస్థాన్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టేనని రాజస్థాన్ హైకోర్టు స్పష్టంచేసింది. 
 
ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తి కేసులో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది. 
 
ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆమెను పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో ఉపాధ్యాయురాలు తన భర్త నుంచి వేరుపడి అతడి వద్దకు వచ్చేసింది. 
 
అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించింది. సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments