బాగా క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (11:21 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టుసమాచారం. గడ్డి కుంభకోణంలో ఆయనకు జైలుశిక్ష పడింది. ఆ తర్వాత ఆయన జైలు జీవితానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.
 
ఈ క్రమంలో గతకొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌ చికిత్స పొందుతున్నారు. ఆయన కిడ్నీలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించొచ్చని వైద్యులు చెబుతున్నారు. 
 
లాలూ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుడు డాక్టర్ ప్రసాద్ లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. అయితే లాలూ 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, అందువల్ల కిడ్నీ పనితీరు క్రమంగా క్షీణించిందని వైద్యుడు ప్రసాద్‌ వెల్లడించారు.
 
అదేసమయంలో చికిత్స కోసం ఆయనను ఎక్కడకూ తరలించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయపడ్డారు. వ్యాధిని ఏ మందూ నయం చేయలేదని.. వేరోచోట చికిత్స చేయించినా ఫలితం ఉండక పోవచ్చన్నారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలంటూ లాలూ తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణను జార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

Rashmika: రశ్మిక మందన్న.. ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్, థియేట్రికల్ రిలీజ్ సిద్ధమవుతోంది

Raja Saab: రాజా సాబ్ నుంచి ప్రభాస్ బర్త్ డే అప్డేట్

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments