Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాలరీల్లో కోత.. విస్ట్రన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వర్కర్ల ఆవేశం.. చితక్కొట్టారు..

Advertiesment
శాలరీల్లో కోత.. విస్ట్రన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వర్కర్ల ఆవేశం.. చితక్కొట్టారు..
, శనివారం, 12 డిశెంబరు 2020 (17:40 IST)
Wistron
ఐఫోన్ తయారీ సంస్థ విస్ట్రన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ నుంచి యాపిల్ ఐఫోన్, ఐటీ ప్రొడక్ట్‌లు అయిన లెనోవా, మైక్రోసాఫ్ట్ లాంటివి ఉత్పత్తి అవుతుంటాయి. ఈ సంస్థపై వేతనాల సమస్యతో వర్కర్లు ఆందోళనకు దిగారు. ఆందోళనతో ఆపకుండా.. తైవాన్‌లో హెడ్ క్వార్టర్స్ ఉన్న విస్ట్రన్ కార్పొరేషన్ వర్కర్లు విధ్వంసానికి పాల్పడ్డారు.

ప్లాంట్ బయట పార్క్ చేసి ఉంచిన కార్లు, ఫర్నిచర్‌ను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. కోలార్ జిల్లాలోని నరసాపురా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి 51కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
 
వర్కర్లు రాళ్లు, అద్దాలు పగలగొట్టి, వాహనాలు చెడగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పాడుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు శాలరీ సమస్యలే కారణమని తెలుస్తోంది. చాలామంది ఉద్యోగులు కాంట్రాక్ట్ మీదే పనిచేస్తున్నారని.. అంతేకాకుండా వారి శాలరీలో చాలా రకాల కోతలు విధిస్తూ వచ్చిందని కంపెనీపై వర్కర్లు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుళ్లు