Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాణా స్కామ్ : మూడో కేసులో కూడా లాలూ ముద్దాయే.. ఐదేళ్ళ జైలు

దాణా స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు మరో కేసులో కూడా ఆయన దోషిగా తేలారు.

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (16:30 IST)
దాణా స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు మరో కేసులో కూడా ఆయన దోషిగా తేలారు. ఈ కేసులో మరో ఐదేళ్ళ జైలుశిక్షను విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆయనతో పాటు దోషిగా తేలిన మాజీ సీఎం జగన్నాథ మిశ్రాకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. అలాగే ఇద్దరికీ రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. 
 
బుధవారం ఉదయం విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం వీరిద్దరినీ దోషులుగా తేల్చింది. మధ్యాహ్నం శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రెండో దాణా కుంభకోణం కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు.
 
మూడో దాణా కుంభకోణం కేసులో ఛాయ్‌బసా ఖజానా నుంచి రూ.36 కోట్లు అక్రమంగా పొందినట్లు లాలూ, మిశ్రాపై కేసు నమోదైంది. 2013 మొదటి దాణా కుంభకోణం కేసులో లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయనపై మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసులు ఉన్నాయి. రెండో దాణా కుంభకోణం కేసులో ఈనెల 6న లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఇదే సీబీఐ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఆయనపై మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments