Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ ద్వారా అశ్లీల చిత్రాలు-యువతి ఎంత పనిచేసిందో తెలుసా?

యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులకు సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు మహిళలు ధైర్యం చేసుకోరు. ఇలా వెలుగులోకి తెస్తే ఆపై జరిగే పరిణామాలను దృష్టిలో పెట్

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (16:24 IST)
యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులకు సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు మహిళలు ధైర్యం చేసుకోరు. ఇలా వెలుగులోకి తెస్తే ఆపై జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆ పనిచేసేందుకు వెనుకడుగు వేస్తారు.
 
అయితే కొంతమంది తమకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెస్తారు. తాజాగా ఓ యువతి ధైర్యం చేసింది. స్మార్ట్‌ఫోన్ ద్వారా అశ్లీల చిత్రాలు పంపిన యువకుడికి చుక్కలు చూపించింది. గొంతునొక్కి ఊపిరాడకుండా చేసింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కైథల్‌లో నలుగురు ముందు అశ్లీల చిత్రాలు పంపిన యువకుడిని ఉతికిపారేసింది. అతని గొంతు నొక్కేసి ఊపిరి ఆడకుండా చేసింది. తొలుత పెద్దగా తిట్ల దండకానికి దిగిన యువతి.. ఆపై అతనిపై దాడి చేసింది. 
 
తనకు ఇలాంటి చిత్రాలు పంపుతావా అంటూ చితకబాదింది. ఆమెతో పాటు తోడుగా వచ్చిన మరో మహిళ కూడా సదరు ప్రబుద్ధుడిపై దాడి చేసింది. ఆపై చుట్టుపక్కల వాళ్లు వచ్చి, మరో నాలుగు వాయించి, అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందని.. ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం