Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాలూకు రాజ మర్యాద: పప్పు, స్వీట్స్, బాస్మతి బియ్యం అన్నం, కాఫీలిచ్చి?

పశువులకు దాణా కొనుగోలు చేస్తున్నట్లుగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా కోర్టు ప్రకటించింది. దియోగఢ్ ఖజానా నుంచి 1994-96 మధ్యకాలంలో రూ. 84.50 లక్షలు అక్రమ

Advertiesment
లాలూకు రాజ మర్యాద: పప్పు, స్వీట్స్, బాస్మతి బియ్యం అన్నం, కాఫీలిచ్చి?
, గురువారం, 28 డిశెంబరు 2017 (10:42 IST)
పశువులకు దాణా కొనుగోలు చేస్తున్నట్లుగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా కోర్టు ప్రకటించింది. దియోగఢ్ ఖజానా నుంచి 1994-96 మధ్యకాలంలో రూ. 84.50 లక్షలు అక్రమంగా తీసుకున్న కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ సహా 16 మందిని పాట్నాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తీర్మానించింది. 
 
అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయితే దోషులకు జనవరి 3న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో రాంచీలోని హాత్వార్ జైలులో వీఐపీ ఖైదీగా కాలం గడుపుతున్న లాలూ ప్రసాద్ యాదవ్.. రాజ భోగాలను అనుభవిస్తున్నారని ప్రభాత ఖబర్ అనే జార్ఖండ్ పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనంలో ఏముందంటే.. 
 
దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపితుడై, శిక్ష కోసం వేచి చూస్తూ, ప్రస్తుతం రాంచీలోని హాత్వార్ జైల్లో వున్న లాలూ ప్రసాద్ అడిగిన వంటకాలను జైలు అధికారులు అందజేస్తున్నారట. ఆయన ఓ ఖైదీగాకన్నా వీఐపీగానే జైల్లో ట్రీట్ చేయబడుతున్నారట. 
 
జైల్లోని పై అంతస్తులో ఉన్న గదిలో ఆయన ఇతర రాజకీయ నాయకులతో కలసి ఉంటున్నారని, కావాల్సినప్పుడల్లా ఆయనకు తినుబండారాలు, కాఫీ తదితర పానీయాలు సమకూరుతున్నాయని తెలుస్తోంది. లాలూకు ఇష్టమైన మొక్కజొన్న, పచ్చి బఠానీ, వంకాయ కూర, తోటకూర, స్వీట్స్, బాస్మతీ బియ్యంతో వండిన అన్నం, పప్పు, సంకట మోచన్ దేవాలయం నుంచి ప్రసాదాన్ని జైలు అధికారులు తెచ్చిస్తున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడల్‌పై ఢిల్లీలో గ్యాంగ్ రేప్: సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని.. అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి?