Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిన్నులతో గుచ్చడం... చెంపలు వాయిస్తూ... చిత్ర హింసలు పెడుతోంది...

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (12:48 IST)
కట్టుకున్న భార్య పెట్టే చిత్ర హింసలను ఓ  భర్త భరించలేక చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. పిన్నులతో గుచ్చడం, చెంపలు వాయించడం, సిగరెట్లతో కాల్చడం ఇలాంటి పనులు చేస్తూ చిత్ర హింసలు పెడుతోందని వాపోయాడు. దీనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సివచ్చిందంటూ ఆయన పేర్కొన్నాడు. 
 
ఈ ఘటన కోల్‌కతాలో జరిగిన ఈ వివరాలను వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన జ్యోతిర్మయి మజుందార్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నాడు. కరోనా వైరస్ భయంతో కొంతకాలం క్రితం తన తల్లిదండ్రులను స్వగ్రామం బైద్యబతిలో వదిలిపెట్టి వచ్చాడు. కేంద్రం నిబంధనలు సడలించడంతో ఇటీవల మళ్లీ వారిని తన వద్దకు తీసుకొచ్చాడు. 
 
అయితే, వారిని ఇంటికి తీసుకురావడం ఇష్టంలేని భార్య.. భర్తను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. సిగిరెట్లతో కాల్చడం, పిన్నులతో గుచ్చడం, చెంపలు వాయించడం చేసేది. భార్య చిత్రహింసలు రోజురోజుకు పెరుగుతుండడంతో పోలీసులను ఆశ్రయించాడు. 
 
తన భార్య ప్రతిరోజూ తనను హింసిస్తోందని, ఆమెపై గృహహింస కేసు కింద అరెస్ట్ చేయాలని కోరాడు. అంతేకాదు, ఆమె తనపై దాడిచేస్తున్న వీడియోలను వారికి చూపించాడు. అయినప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో జ్యోతిర్మయి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments