Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికో హత్యాచార కేసు : ఆర్జీ కర్ వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ అరెస్టు!

ఠాగూర్
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:26 IST)
కోల్‌కతా మెడికో హత్యాచార కేసులో ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన వద్ద ఏకంగా 16 రోజుల పాటు ప్రశ్నించింది. హత్యాచార కేసు, ఆర్థిక అవకతవకల కేసుల్లో ఆయన వద్ద ఈ విచారణ జరిగింది. 
 
గత నెల 9వ తేదీన ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రి సెమినార్ హాల్లో ఓ మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన విషయం తెల్సిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను అరెస్టు చేశారు. అయితే, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైఖరి అనుమానాస్పదంగా ఉండటంతో సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టి నుంచి ఆయనను ప్రశ్నిస్తూ వచ్చింది. పలుమార్లు ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది. 
 
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలోనూ, ఆర్జీ కర్ వైద్య కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల విషయంలోనూ సీబీఐ సమాంతర దర్యాప్తు చేపట్టింది. ఈ రెండు కేసుల్లోనూ సందీప్ ఘోష్‌ను సీబీఐ 16 రోజుల పాటు సుధీర్ఘంగా లోతుగా ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆయనను సోమవారం అరెస్టు చేసినట్టు సీబీఐ ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనను అరెస్టు చేశారన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం