Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోల్‌కతా మెడికో హత్య కేసులో బిగ్ ట్విస్ట్ : ఘటన జరిగిన తర్వాత సెమినార్ హాలులో సందడి!

Advertiesment
rape

ఠాగూర్

, మంగళవారం, 27 ఆగస్టు 2024 (15:35 IST)
కోల్‌కతా మెడికో హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. ఘటన జరిగిన తర్వాత సెమినార్ హాలులోకి అనేక మంది వెళ్లి సందడి సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి రావడం వైరల్ కావడం జరుగుతుంది. మెడికోపై అత్యాచారం, హత్య ఘటన తర్వాత డాక్టర్ దేబాశిష్ సోమ్ (సందీప్ ఘోష్ సన్నిహితుడు, ఆర్జీ కర్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు), పోలీసులు, ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ న్యాయవాది శంతన డే, ఘోష్ పీఏ, ఆస్పత్రి ఔట్ పోస్టు సిబ్బంది సెమినార్ హాలులో కనిపించారు. వీరంతా ఏదో విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. అయితే, ఈ వీడియోలో భాధిత వైద్యురాలి మృతదేహం మాత్రం కనిపించకపోవడం గమనార్హం. 
 
అయితే, ఇపుడు ఈ వీడియో అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తుంది. వీరందరూ కలిసి ఆధారు చెరివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు వారందరూ ఆ గదిలోకి ఎదుకు వెళ్ళారు. ఏం చర్చించుకుంటున్నారన్న విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అదేసమయంలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీ స్పందించారు. 
 
పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్లారని, అది కూడా నిషేధిత ప్రాంతంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. మరి లాయర్ అక్కడ ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఆ తర్వాత మాట్లాడుతూ, ఈ విషయం గురించి ఆస్పత్రి అధికారులు మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్త పన్ను చెల్లించమన్న మేయర్.. చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంట్లో పోసిన ప్రజలు (Video)