Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిమినల్ కేసులున్న వ్యక్తికి భారత రత్న ఇస్తారా? కేఏ పాల్

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (18:49 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత్ రత్న పురస్కార అవార్డు ప్రకటించడాన్ని కేఎల్ పాల్ తప్పు బట్టారు. క్రిమినల్ కేసులన్న వ్యక్తికి అత్యున్నత పురస్కార అవార్డు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. 
 
ప్రపంచశాంతి కోసం పాటుబడ్డ లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగికి అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితుడనే కారణంగా బాలయోగికి పురస్కారం ఇవ్వలేదా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
ప్రణబ్‌పై అమెరికాలో తమ సంస్థ క్రిమినల్ కేసులు వేసిందని అమెరికా నుంచి ప్రణబ్‌కు సమన్లు కూడా అందాయని పాల్ గుర్తు చేశారు. లోక్‌సభలో మెజార్టీ ఉంది కదా అని... ఎవరికి పడితే వారికి భారతరత్న ఇచ్చేస్తారా? అని మండిపడ్డారు. 
 
2004లో కేంద్ర మంత్రి ప్రణబ్, ఏపీ సీఎం వైఎస్ఆర్‌లు.. ఇద్దరూ కలసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని కేఏ పాల్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments