Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీపీఐ పార్టీ బ్యానర్‌లో కిమ్ జాంగ్.. బీజేపీ సెటైర్లు

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్న ఫొటో సీపీఐ పార్టీ బ్యానర్‌లో కనిపించడం సంచలనం రేకెత్తిస్తోంది. వరుస అణు ప్రయోగాలతో అలజడి సృష్టిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంబ్ ఫోటో సీపీఐ బ్యానర్‍‌లో కని

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (16:24 IST)
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్న ఫొటో సీపీఐ పార్టీ బ్యానర్‌లో కనిపించడం సంచలనం రేకెత్తిస్తోంది. వరుస అణు ప్రయోగాలతో అలజడి సృష్టిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంబ్ ఫోటో సీపీఐ బ్యానర్‍‌లో కనిపించడంపై రాజకీయంగా చర్చ సాగుతోంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో కేరళలోని నడుమ్‌కందంలో సీపీఐ-ఎం పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
 
ఈ సభలో పాల్గొనే సీపీఎం క్యాడర్‌కు స్వాగతం పలుకుతూ వెలసిన ఫ్లెక్సీలో కిమ్ జాంగ్ ఫోటో వుండటం సంచలనానికి తావిస్తోంది. ఆ ఫ్లెక్సీలో ఇంకెవరి ఫొటో లేకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై భారతీయ జనతా పార్టీ మండిపడింది.

కేరళలో వరుసగా ఆరెస్సెస్ కార్యకర్తలు హత్యలకు గురికావడానికి ఇదే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. భారత్‌లో వున్న బీజేపీ, ఆరెస్సెస్ కార్యాలయాలపై కిమ్ జాంగ్ తరహాలో సీపీఐ అణు క్షిపణులను వేయదని ఆశిస్తున్నామని ట్విట్టర్లో సంబిత్ సెటైర్లు వేశారు. కేరళలో సీపీఐ హత్యాకాండను కొనసాగిస్తోందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments