Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్సీ దుర్గపై రచ్చెందుకు..? బార్లు, వైన్ షాపులకు ఆ పేరు లేదా? ప్రకాష్ రాజ్

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య గురించి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఇటీవల బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డేపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెల

Advertiesment
సెక్సీ దుర్గపై రచ్చెందుకు..? బార్లు, వైన్ షాపులకు ఆ పేరు లేదా? ప్రకాష్ రాజ్
, సోమవారం, 11 డిశెంబరు 2017 (08:59 IST)
ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య గురించి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఇటీవల బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డేపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని హెగ్డే చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ ఖండిస్తూ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు.
 
తాజాగా కేరళలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (ఐఎఫ్ఎఫ్‌కే) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. తనకు కేరళ అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడికి భయం లేకుండా రావచ్చని అన్నారు. ఇక్కడ సెన్సార్ లేకపోవడంతో తాను స్క్రిప్ట్ కూడా తెచ్చుకోనన్నారు.
 
సనాల కుమార్ శశిధరన్ దర్శకత్వంలో నిర్మించిన ''సెక్సీ దుర్గా'' గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. సినిమాపై అనవసర రాద్దాంతం చేయొద్దన్నారు. దుర్గ పేరుతో వైన్ షాప్- బార్లు కనిపించవా అంటూ ప్రశ్నించారు. తనను భయపెట్టాలని చూస్తున్న వారిని చూస్తే నవ్వొస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాకపోవడం వల్లే తన భావాలను నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నానని ప్రకాష్ రాజ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం : ప్రధాని మోడీ ఆరోపణ