Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతింటికే కన్నం వేసిన ఘనులు.. ఆ తర్వాత కారం చల్లి...

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (18:01 IST)
తన స్నేహితుల సహకారంతో సొంతింటికే కన్నం వేశాడో యువకుడు. ఆ తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో దాన్నిదాచిపెట్టేందుకు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కారం చల్లి కప్పిపుచ్చాలని భావించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ పుదుపరియారానికి చెందిన బైజు అనే యువకుడు తన స్నేహితులు సుని, సుశాంత్‌లతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆర్థిక కష్టాలను ఆధికమించేందుకు సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడ్డాడు. 
 
తన స్నేహితులకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి వారిన ఒప్పించి, తన ఇంటిలో చోరీకి తీసుకెళ్లాడు. ఆ ఇంటికి వెళ్లిన తర్వాత తలుపులు తెరిచే అవకాశం ఉన్నప్పటికీ ఆపని చేయకుండా తలుపులు బద్ధలుకొట్టిన బైజు.. ఇంటిలోని బంగారం, డబ్బు, ఇతరాత్రా విలువైన వస్తువులను దోచుకున్నాడు. పైగా, చోరీ చేసిన ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు వీలుగా ఇంట్లో కారం చల్లి, వస్తువులను చిందరవందరగా పడేసి తన స్నేహితులతో కలిసి వెళ్లిపోయాడు.
 
ఇంతలో ఆలయానికి వెళ్లిన బైజు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, చోరీ జరిగినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన తర్వాత బైజును అనుమానించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకు విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో బైజుతో పాటు చోరీకి అతనికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితులను కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments