Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే జెఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (17:35 IST)
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ సెషన్‌-2కు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల 6 నుంచి 12 తేదీల మధ్య జరిగే ఈ పరీక్షలకు ఈ వారం రోజుల్లోనే అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనున్నట్టు అధికారులు తాజాగా వెల్లడించారు. 
 
జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) పరీక్ష కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. అడ్మిట్‌ కార్డులతో పాటు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in, nta.ac.inలలో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. 
 
ఈ అడ్మిట్ కార్డులను డౌన్ చేసుకోవాలంటే... jeemain.nta.nic.in వెబ్ సైట్‌ను క్లిక్ చేయాల్సివుంటుంది. హోం పేజీలో జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు 2023 సెషన్‌-2కు సంబంధించిన లింక్‌పై క్లిక్‌ చేయాలి. మీ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
 
జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది. ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్‌ తీసుకుని పెట్టుకోవాలి. కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం పేరు, ఇతర వివరాలన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి. ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.in. ద్వారా ఎన్‌టీఏకు ఇ-మెయిల్‌ చేయాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments