వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. మరొక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుందుకడవు గ
వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. మరొక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుందుకడవు గ్రామానికి చెందిన బిరాజ్ (39) అనే వ్యక్తి ఓ దుకాణంలో పని చేస్తూ జీతు అనే మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు.
ఈ గ్యాప్‌లో జీతుకు ఫేస్‌బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తితో జీతు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బిరాజ్.. తన భార్యతో విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య జీతు పుట్టింటికి వెళ్లిపోయింది.
భర్తను కాదని వేరొక వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న జీతుపై కోపంగా వున్న బిరాజ్.. ఆమె ఇంటికెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు. తీవ్రగాయాల పాలైన జీతును త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పరారీలో ఉన్న బిరాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.