Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ చోరీ చేశాడనీ వృషణాలు కోసిపారేశారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:10 IST)
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో దారుణం జరిగింది. మొబైల్ చోరీ చేశాడనీ వృషణాలను కోసిపారేశారు. అదీకూడా పట్టపగలు, జనసంచారం రద్దీగా ఉండే తిరువనంతపురం బస్టాండులో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువళ్లంకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఇటీవలే తిరువనంతపురం బస్టాండ్‌కు వెళ్లాడు. రాత్రి సమయంలో బస్టాండ్‌లో నిద్రిస్తున్న మరో వ్యక్తి సెల్‌ఫోన్‌, పర్స్‌ను ఈ యువకుడు దొంగిలించినట్లు స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు అనుమానించారు. 
 
దీంతో సెల్‌ఫోన్‌ దొంగిలించడాన్న నెపంతో.. ఆ యువకుడిని తీవ్రంగా చితకబాది పదునైన ఆయుధాలతో వృషణాలను కోసేశారు. ఆ తర్వాత ఆ భాగంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రైవేట్ భాగాల్లో పెట్రోల్‌ పోసి తగులబెట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే యువకుడిని చితకబాదిన దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించి వైరల్‌ చేశాడు. ఈ వీడియో ఆధారంగా ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments