Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో మళ్లీ వెలుగు చూసిన నోరోవైరస్ - బాధితులుగా ఇద్దరు చిన్నారులు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (11:20 IST)
కేరళ రాష్ట్రంలో సరికొత్త వైరస్ వెలుగు చూసింది. గతంలో ఒకసారి ఈ వైరస్ కనిపించింది. ఇపుడు వళింజమ్ అనే ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. అయితే, ఈ వైరస్ సోకిన బాధిత చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 
 
తమ రాష్ట్రంలో కొత్తగా నోరోవైరస్ కేసులు నమోదైనట్టు ఆమె తెలిపారు. పైగా, కలుషిత ఆహారం, అతిసార ఫిర్యాదుల నేపథ్యంలో పళంజమ్‌లోని ఎల్ఎంఎస్ఎల్‌పీ పాఠశాల విద్యార్థుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రజారోగ్య పరిశోధనా కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆరోగ్య శాఖ అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టిందని తెలిపారు. వయనాడులోని వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు గతంలో నోరోవైరస్ బారినపడ్డారు. 
 
ఆ వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంతో అపుడు నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ తరహా కేసులో నమోదు కాలేదు. కానీ ఇపుడు మళ్లీ ఈ వైరస్ ఇద్దరు చిన్నారుల్లో వెలుగు చూసింది. 
 
ఇదిలావుంటే, ఆహారం లేదా కలుషి ద్రవాల ద్వారా నోరోవైర్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ ఉన్న ఉపరితలాలు, వస్తువులను తాకడం ద్వారా గానీ, అది సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం వల్లగానీ ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments