Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళను వణికిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్.. వ్యక్తి మృతి

mosquito
, సోమవారం, 30 మే 2022 (21:51 IST)
కేరళను వెస్ట్ నైల్ ఫీవర్ వణికిస్తోంది. త్రిసూర్‌లో వెక్టార్-బోర్న్ డిసీజ్‌తో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించడంతో రాష్ట్రంలో అలర్ట్ కూడా ప్రకటించారు. ఇదే దేశంలో నమోదైన తొలి వెస్ట్ నైల్ కేసు ఇదే. ఈ వైరస్ క్యూలెక్స్ జాతుల దోమల ద్వారా వ్యాపిస్తుంది. 
 
పుటన్‌పురక్కల్ జోబీ (47) అనే వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఇతనితో సన్నిహితంగా మెగిలిన ఇద్దరు వ్యక్తులలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి రక్త నమూనాలను సేకరించిన ఆర్యోగ శాఖ అధికారులు టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.
 
వెస్ట్ నైల్ వైరస్ (డబ్ల్యూఎన్వీ) అనేది క్యూలెక్స్ జాతికి చెందిన సోకిన దోమల ద్వారా వ్యాపించే ఒక రకమైన అంటు వ్యాధి. వ్యాధి సోకిన పక్షులను దోమలు కుట్టినప్పుడు ఈ వైరస్ వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి. రక్త మార్పిడి, అవయవ మార్పిడి గర్భధారణ సమయంలో తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్ వ్యాపించినట్లు గుర్తించినట్లు వైద్యులు చెప్తున్నారు.  
 
ఈ వైరస్ బారిన పడిన ప్రతి 5 మందిలో ఒకరికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా దద్దుర్లతో కూడా జ్వరం రావచ్చు. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు, అయితే వ్యాధి తగ్గిన తర్వాత అలసట, బలహీనత వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా? ఇది బయోలాజికల్ ఆయుధమా? లాక్‌డౌన్లు తప్పవా?