Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ లాక్డౌన్ దిశగా ఆ రాష్ట్రం... విజృంభిస్తున్న కరోనా వైరస్

Webdunia
గురువారం, 22 జులై 2021 (09:03 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా మేరకు తగ్గినట్టు కనిపించింది. కానీ, మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వారంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు లాక్​డౌన్​ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కూడా జూన్​ 12,13 తేదీల్లో విధించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలే వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. 
 
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం మూసివేయనున్నట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే, ఈ నెల 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్​ నమూనాలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments