Publish Date: Thu, 15 Jul 2021 (10:59 IST)
Updated Date: Thu, 15 Jul 2021 (11:00 IST)
దేశంలో కొత్తగా మరో 41 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య బుధవారంకంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో 41,806 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4,32,041 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మరోవైపు, ఇప్పటివరకు 4,11,989 మంది మహమ్మారి వల్ల మరణించారు. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,130 మంది కొత్తగా డిశ్చార్జీకాగా, 581 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.