Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వచ్చిన 43 మందికి కరోనా పాజిటివ్... వధువు తండ్రిపై కేసు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (07:32 IST)
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వం సూచిస్తున్న మార్గదర్శకాలు పాటించాలని చెబుతున్న కొందరు పట్టించుకోవడం లేదు. వీలైనంత తక్కువ మందితో శుభకార్యాలు చేసుకోవచ్చని సడలింపులు ఇవ్వడంతో కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. 
 
కానీ, చాలా మంది అజాగ్రత్తగా ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తికి తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా, తన కుమార్తె పెళ్లిని ఘనంగా చేసి 43 మందికి వైరస్ సోకడానికి కారణమయ్యాడో తండ్రి. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జూలై 17వ తేదీన కేరళలోని కాసర్‌గఢ్ జిల్లాలో జరిగింది. కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు హాజరైన వారిలో ఏకంగా 43 మంది కొవిడ్ బారినపడ్డారు.
 
నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున వేడుకకు హాజరు కావడంతో స్పందించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించగా అందులో వధూవరులు సహా మొత్తం 43 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఇక, నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన వధువు కేరళ పోలీసులు... కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ 2020 కింద వధువు తండ్రిపై బడియుడుక్కా కేసు నమోదు చేశారు. కేరళలో ఆదివారం 927 కొవిడ్ -19 పాజిటివ్‌ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 9,655 క్రియాశీల కేసులున్నాయి.
 
ఆ తర్వాత వివాహ కార్యక్రమానికి హాజరై వ్యక్తులను నిర్బంధంలో ఉండాలని లక్షణాలుంటే, సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంపద్రించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఇందులో సుమారు 43 మందికి వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. దీనిపై కాసర్గోడ్ జిల్లా అథారిటీ కేసు నమోదు చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments