Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల, గురువాయూరు ఆలయాల్లో దర్శనం.. ఎప్పటి నుంచో తెలుసా?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (17:33 IST)
కరోనా లాక్‌డౌన్ 5.0లో భాగంగా ఆంక్షలను సడలిస్తుండడంతో జూన్ 14 నుంచి జూన్ 28వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరిచి ఉంటుందని దేవస్థానం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. మలయాళీల మాసమైన మిథునం జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందని, దీంతో ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అందుకుగాను ఆలయాన్ని తెరుస్తామని వివరించారు.
 
ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కోవిడ్ జాగ్రత్త రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో తమ వివరాలను ముందుగా నమోదు చేసుకోవాలని, వారికే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.  
 
ఇక భక్తులు తమకు ఎలాంటి వ్యాధులు లేవని నిర్దారిస్తూ ల్యాబ్‌ల నుంచి తెచ్చుకున్న ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని, ఆ ల్యాబ్‌లు ఐసీఎంఆర్ గుర్తింపు కలిగి ఉండాలన్నారు. అన్ని వివరాలను పరిశీలించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని అన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్లను వాడాలని సూచించారు.
 
కేరళలోని ప్రఖ్యాత గురువాయూరు ఆలయంలో పెళ్లిళ్లు అనుమతించనున్నారు. ప్రస్తుత లాక్‌డౌన్ సడలింపులు నేపథ్యంలో గురువాయూరు ఆలయంలో మళ్లీ సాంప్రదాయ పెళ్ళిళ్లు ప్రారంభం కానున్నాయి. గురువాయూరు ఆలయాన్ని సందర్శించాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని అధికార వర్గాల సమాచారం. రోజులో 600 మందిని పూజలకు అనుమతిస్తారు.
 
అలాగే, ఆలయ ప్రాంగణంలో రోజుకు 60 పెళ్లిళ్లను మాత్రమే అనుమతించనున్నారు. ఒక్కో వివాహ బృందంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో కలిపి 10 మందిని మాత్రమే అనుమతిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments