Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్ క్లాసులు.. పిల్లల్లో ఆసక్తి లేదు.. తల్లిదండ్రులకు తలనొప్పి..

Advertiesment
ఆన్‌లైన్ క్లాసులు.. పిల్లల్లో ఆసక్తి లేదు.. తల్లిదండ్రులకు తలనొప్పి..
, శుక్రవారం, 5 జూన్ 2020 (11:26 IST)
Online Classes
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్‌లో వున్నాయి. ఫలితంగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి పట్టునే వుండి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పాఠశాలల యాజమాన్యాలు ఆన్ లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చూడాలని పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించి సాధారణ తరగతులు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఒకవేళ తరగతులు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగిస్తామని పాఠశాల యాజమాన్యాలు హామీ ఇస్తున్నాయి. కానీ ఆన్ లైన్ క్లాసులు చెబుతున్న యాజమాన్యం… పిల్లలకి అవి అర్థం అవుతున్నాయో లేదో కూడా పట్టించుకోవడం లేదు. 
 
అంతేకాకుండా హోంవర్క్ అని భయంకరంగా వర్క్ ఇవ్వటంతో పిల్లలు ఆన్ లైన్ క్లాసులు విషయంలో సరిగ్గా శ్రద్ధ చూపడం లేదు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులకు సరైన అవగాహన టెక్నాలజీపై లేకపోవడంతో… అటువంటి పిల్లలు క్లాసులు మిస్ అవుతున్నారు. మరోపక్క ఈ క్లాసులు జరుగుతున్న తరుణంలో ఉద్యోగం లేక ఉపాధి లేక ఇళ్లలో ఉన్న పిల్లల తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యాలు ఫీజులు అడుగుతున్నాయి.
 
దీంతో చాలా వరకు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలు ప్రవర్తించిన తీరుపై  మండిపడుతున్నారు. పనులు లేక ఇంట్లో తినటానికి తిండి లేక ఉన్న సమయంలో మిమ్మల్ని ఆన్‌లైన్ క్లాసులు ఎవరు చెప్పమన్నారు మమ్మల్ని స్కూల్ ఫీజు ఎందుకు అడుగుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో కరోనా ఎఫెక్ట్‌తో పిల్లలకి ఆన్‌లైన్ క్లాసుల విషయంలో సరైన ప్లానింగ్ లేక స్కూల్ యాజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంకా ఈ ఆన్‌లైన్ క్లాసుల ద్వారా తల్లిదండ్రులు, పిల్లలు నానా తంటాలు పడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహంతో బాధపడేవారు మొక్కజొన్న తింటే?